DK Shivakumar: ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట, అభిమానులు మృతి.. స్పందించిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్
- బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారీ తొక్కిసలాట
- మృతుల వివరాలు ఇప్పుడే ధ్రువీకరించలేమన్న డీకే శివకుమార్
- యువత కావడంతో లాఠీఛార్జ్ చేయలేకపోయామన్న ఉప ముఖ్యమంత్రి
ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంబరాల్లో పలువురు మృతి చెందగా, యాభై మందికి పైగా గాయపడ్డారు. జట్టు విజయోత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది.
చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట.. 10 మంది మృతి
ఈ దుర్ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. తొక్కిసలాటలో ఎంతమంది మరణించారనే దానిపై ఇప్పుడే స్పష్టమైన సమాచారం ఇవ్వలేమని ఆయన తెలిపారు. "మృతుల వివరాలను ధృవీకరించాల్సి ఉంది. భద్రత కోసం 5,000 మందికి పైగా సిబ్బందిని ఏర్పాటు చేశాం. అయితే, అక్కడ ఉన్నది ఉత్సాహంతో ఉన్న యువత. వారిపై లాఠీఛార్జ్ చేయలేము కదా" అని డీకే శివకుమార్ అన్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ తొక్కిసలాటలో పది మంది వరకు మృతి చెందగా, యాభై మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.