Vishnu Manchu: జూన్ 6న విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ‘ఢీ’ రీ రిలీజ్

Vishnu Manchus Dhee Movie Re releasing on June 6

  • 2007లో వచ్చిన ఢీ
  • మంచు విష్ణు, జెనీలియా జంటగా బ్లాక్ బస్టర్ మూవీ
  • శ్రీను వైట్ల దర్శకత్వంలో చిత్రం

టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా, జెనీలియా హీరోయిన్‌గా శ్రీనువైట్ల తెరకెక్కించిన చిత్రం ‘ఢీ’. 2007లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర, బ్రహ్మానందం కామెడీ, సునీల్ ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో విష్ణు కామెడీ టైమింగ్‌కు కాసుల వర్షం కురిసింది. మంచు విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఢీ’ మూవీనీ జూన్ 6వ తేదీన రీ రిలీజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విష్ణు నుంచి వచ్చిన ఈ కామెడీ బ్లాక్ బస్టర్ సినిమాను మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ వారంలో థియేటర్లోకి ఢీ మూవీని మళ్లీ అందించబోతోన్నారు. అసలే ఇప్పుడు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో ఉన్నారు. విష్ణు ఈ కన్నప్ప చిత్రంతో సందడి చేసే కంటే ముందే మళ్లీ ‘ఢీ’తో మరోసారి అందరినీ పలకరించనున్నారు. ‘కన్నప్ప’ చిత్రాన్ని జూన్ 27న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే.

Vishnu Manchu
Dhee Movie
Genelia
Sreenu Vaitla
Telugu Movie Re-release
Kannappa Movie
Brahmanandam Comedy
Srihari
Telugu Cinema
June 6
  • Loading...

More Telugu News