Prashanth Neel: బెంగళూరు విజయం.. ఎగిరి గంతేసిన ప్రశాంత్ నీల్.. వీడియో వైరల్!

- ఈ సాలా కప్ నమ్దే.. అంటూ ఏళ్లకు ఏళ్లు ఊరించి ఎట్టకేలకు టైటిల్ కైవసం
- ఈసారి కప్ కొట్టామంటూ ఆర్‌సీబీ అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలు
- అభిమానుల నుంచి మొదలు సినీ సెలబ్రిటీల వరకు అందరూ సెలబ్రేషన్స్
- ఆర్‌సీబీ విజయంతో ఎగిరి గంతేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్
- ఆయన సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను షేర్ చేసిన అర్ధాంగి లికితారెడ్డి
ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తొలిసారిగా కప్పు కొట్టింది. ఈ సాలా కప్ నమ్దే.. అంటూ ఏళ్లకు ఏళ్లు ఊరించి ఎట్టకేలకు టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో బెంగళూరు ఫ్యాన్స్ 18 ఏళ్ల కలను జట్టు నిజం చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ ఈసారి కప్ కొట్టామంటూ ఆర్‌సీబీ అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలు చేసుకున్నారు.
ఇలా అభిమానుల నుంచి మొదలు సినీ సెలబ్రిటీల వరకు అందరూ సంబరాలు చేసుకున్నారు. తమ భావోద్వేగాలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక, భారీ తెరపై మ్యాచ్‌ను వీక్షించిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్... బెంగళూరు విజయం సాధించిన వెంటనే ఆనందంతో ఎగిరి గంతేశారు. ఆయన సెలబ్రేషన్స్ తాలూకు వీడియోను అర్ధాంగి లికితారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
"ఈ సాలా కప్ నమ్‌దు. 18 ఏళ్ల కల నెరవేరింది. క్రేజియెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్‌కు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్" అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈరోజు (జూన్ 4) ప్రశాంత్ నీల్ బర్త్‌డే కూడా కావడంతో ఆ ఆనందం రెట్టింపు అయింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ కప్పు కొట్టడంతో సర్వాత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.