Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ వేడుక వాయిదా

Pawan Kalyan Hari Hara Veera Mallu Pre Release Event Postponed

  • పవన్ కల్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు
  • ఈ నెల 8న తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
  • తదుపరి తేదీ ప్రకటిస్తామన్న నిర్వాహకులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. తిరుపతిలోని ఎస్‌వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించాలని భావించారు. అయితే, అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.

మరోవైపు సినిమా విడుదల కూడా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, జ్యోతి కృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కావాల్సి ఉంది.

కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కానందున సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ, సినిమా విడుదల వాయిదాపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 

Pawan Kalyan
Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu movie
AM Ratnam
Krish Jagarlamudi
Telugu cinema
pre release event
movie release date
post production
SVU Taraka Rama Stadium
  • Loading...

More Telugu News