జియో హాట్ స్టార్ లో మలయాళం సూపర్ హిట్!

  • మలయాళ సినిమాగా 'పదక్కలం'
  • కామెడీ టచ్ తో సాగే కంటెంట్ 
  • బాక్సాఫీస్ నుంచి 13 కోట్లకి పైగా రాబట్టిన సినిమా
  • ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్   

మలయాళ సినిమాలు ఈ మధ్య కాలంలో కంటెంట్ విషయంలో కొత్త ప్రయోగాలకు చేస్తూ వెళుతున్నాయి. చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమాలు భారీ లాభాలను తెచ్చి దోసిట్లో పోస్తున్నాయి. విజయానికి చాలా దగ్గరగా వెళ్లే సినిమాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలా చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన సినిమానే 'పదక్కలం'. తెలుగులో 'పెన్సిల్' అని అర్థం. 

విజయ్ బాబు - సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమాకి, మను స్వరాజ్ దర్శకత్వం వహించాడు. రాజేశ్ మురుగేశన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, సూరజ్ వెంజరమూడు ..  షర్ఫుద్దీన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మే 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేసిన ఈ సినిమాకి మంచి రెస్సాన్స్ వచ్చింది. ఈ ఏడాదిలో వచ్చిన మంచి కామెడీ కంటెంట్ గా మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 10వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో అందుబాటులోకి రానుంది. 

కామిక్ పుస్తకాలను ఇష్టపడే నలుగురు స్నేహితుల కథ ఇది. కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ కారణంగా వాళ్ల జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. అదేమిటి? ఆ తరువాత వాళ్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. ఐఎండీబీలో 7.6 రేటింగును సాధించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి మరి.



More Telugu News