Rana Naidu Season 2: ఆసక్తికరంగా 'రానా నాయుడు: సీజన్ 2' ట్రైలర్

- వెంకటేశ్, రానా ప్రధాన పాత్రలలో రూపొందిన వెబ్ సిరీస్
- యువతను బాగా ఆకట్టుకున్న మొదటి సీజన్
- తొలి భాగానికి కొనసాగింపుగా ‘రానా నాయుడు: సీజన్ 2’
- ఇందులో వినోదం, థ్రిల్లింగ్ అంశాలు
- జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
విక్టరీ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రలలో రూపొందిన వెబ్ సిరీస్ రానా నాయుడు. మొదటి సీజన్ యువతను బాగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు కొనసాగింపుగా ‘రానా నాయుడు: సీజన్ 2’ వస్తోంది. దీని కోసం అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రానా నాయుడు సీజన్ 2కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఇందులో వినోదం, థ్రిల్లింగ్ అంశాలు అంచనాలని పెంచేశాయి. ‘రానా నాయుడు: సీజన్ 2’లో నాగ నాయుడుగా వెంకటేశ్ సందడి చేయనున్నారు. ‘రానా నాయుడు: సీజన్ 2’ మొత్తం యాక్షన్, డ్రామాతో నిండి ఉంటుంది. ఇది జూన్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
తొలి పార్ట్‌లో కాస్త బోల్డ్ కంటెంట్ ఉందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీక్వెల్‌లో కాస్త దానిని తగ్గించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఇది విడుదల కానుంది. అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్భంద, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినోమోరియా తదతరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
కాగా, రియల్ లైఫ్ లో బాబాయి, అబ్బాయిలు ఈ వెబ్ సిరీస్ లో తండ్రి తనయులుగా నటించిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ సిరీస్‌ని కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా తెరకెక్కించగా... సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ మీడియా నిర్మించింది.