నెట్ ఫ్లిక్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ హారర్ థ్రిల్లర్!

Katteri Movie Update
  • 2022లో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • జానపద కథను తలపించే కంటెంట్
  • కామెడీ టచ్ తో సాగే హారర్ థ్రిల్లర్  
  • వరలక్ష్మి శరత్ కుమార్ ఎపిసోడ్ హైలైట్ 
      
హారర్ థ్రిల్లర్ జోనర్ కి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ జోనర్ నుంచి కొత్తగా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ దిగిపోతూనే ఉంటుంది. ఒకవేళ కొత్తగా ఈ జోనర్ నుంచి ఏ సినిమా రాకపోయినా, గతంలో వచ్చిన హారర్ థ్రిల్లర్స్ లో ఏది ఎక్కువగా కనెక్ట్ అవుతుతుందనేది సెర్చ్ చేస్తూ వెళతారు. అలాంటి వారికి కామెడీ టచ్ తో సాగే తమిళ హారర్ థ్రిల్లర్ ఒకటి నచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఆ సినిమా పేరే 'కట్టేరి' .. అంటే 'రక్తపిశాచి' అని అర్థం. 

జ్ఞానవేల్ రాజా - ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి, డీకే దర్శకత్వం వహించాడు. ఎస్ ఎన్ ప్రసాద్ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమా, 2022 ఆగస్టులో థియేటర్లకు వచ్చింది. థియేటర్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా, ఆ తరువాత ఓటీటీ వైపుకు వచ్చింది. అలా ఓటీటీలో అడుగుపెట్టినప్పుడు ఎంతమంది చూశారోగానీ, ఈ మధ్య కాలంలో ఈ సినిమాను ఎక్కువ మంది చూస్తూ వెళుతుండటం గమనించవలసిన విషయం. వరలక్ష్మి శరత్ కుమార్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. 

కథ విషయానికి వస్తే .. అది అడవికి ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఆ విలేజ్ లో మత్తమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) ఆమె చెల్లెలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఆ ఇంటి పెరటిలో ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావిలో ఒక రక్తపిశాచి ఉంటుంది. ఆ పిశాచికి ఆహారంగా ఆ బావిలోకి ఎవరినైనా తోసేస్తే ఆ ఎత్తు బంగారాన్ని ఆ పిశాచి పైకి పంపుతూ ఉంటుంది. ఈ విషయం ఒక పోలీస్ ఆఫీసర్ కి   తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ నిధి కోసం ఆ ఊరికి చేరుకున్న హీరో బ్యాచ్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనేది కథ.

Go Back to Shorts
Varalaxmi Sarathkumar
Katteri
Netflix
Tamil horror thriller
horror movie
OTT platform
bloodthirsty ghost
Gnanavel Raja
SR Prabhu

More Telugu News