Russia Ukraine Conflict: ఉక్రెయిన్ కు రష్యా షరతులు.. ఇస్తాంబుల్ చర్చల్లో రష్యా ప్రతిపాదన

Russia Ukraine Conflict Russia Presents Conditions at Istanbul Talks
  • షరతులకు అంగీకరిస్తేనే శాంతి ఒప్పందానికి ఓకే
  • ఖైదీల మార్పిడికి ఓకే, శాంతిపై వీడని ప్రతిష్టంభన
  • ఇస్తాంబుల్ భేటీ అట్టర్ ఫ్లాప్.. గంటలోనే ముగిసిన శాంతి చర్చలు
మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా సోమవారం రెండో విడత చర్చలు జరిగాయి. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ చర్చల సందర్భంగా రష్యా పలు కీలక షరతులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తమ షరతులకు అంగీకరిస్తేనే శాంతి ఒప్పందంపై ఆలోచిస్తామని మెలిక పెట్టింది. దీంతో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధుల చర్చలు గంటలోపే ముగిశాయి. ఈ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని సమాచారం. అయితే, ఖైదీల మార్పిడికి మాత్రం రెండు దేశాలు అంగీకరించడం కొంత ఊరటనిచ్చే అంశం.

ఈ చర్చల్లో భాగంగా, తీవ్రంగా గాయపడిన, అనారోగ్యంతో ఉన్న సైనికులతో పాటు 25 ఏళ్లలోపు వయసున్న యువ సైనికులను పరస్పరం మార్చుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. "ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఖైదీల మార్పిడికి మేము అంగీకరించాం. ఇరుపక్షాల నుంచి కనీసం 1,000 మంది చొప్పున, బహుశా అంతకంటే ఎక్కువ మందే విడుదల కావచ్చు. ఈ సంఖ్యలను ఖరారు చేస్తున్నాం" అని రష్యా ప్రతినిధి బృందం తెలిపింది. దాదాపు 12,000 సైనికుల మృతదేహాలను కూడా అప్పగించుకోవాలని నిర్ణయించారు. కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు రోజుల కాల్పుల విరమణకు రష్యా ప్రతిపాదించినా, వివరాలు వెల్లడించలేదు.

మరోవైపు, ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, "తక్షణమే హత్యలు ఆపేందుకు భూమి, సముద్రం, గగనతలంలో కనీసం 30 రోజుల పాటు పూర్తిస్థాయి, షరతులు లేని కాల్పుల విరమణ"కు పట్టుబట్టింది. అయితే, షరతులు లేని కాల్పుల విరమణ డిమాండ్‌ను రష్యా మరోసారి తిరస్కరించిందని ఉమెరోవ్ పేర్కొన్నారు. ఇరుదేశాల కాల్పుల విరమణ ప్రతిపాదనల పూర్తి పాఠాలు అధికారికంగా బయటకు రాలేదు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని దాదాపు 20% భూభాగం రష్యా నియంత్రణలో ఉంది. ఈ చర్చలతో ఇరు దేశాల మధ్య విభేదాలు ఇంకా తీవ్రంగానే ఉన్నాయని స్పష్టమైంది.

రష్యా షరతులు ఇవే..
ఉక్రెయిన్ లోని మరిన్ని భూభాగాలను తమకు అప్పగించాలి
సైన్యం పరిమాణంపై పరిమితులు విధించుకోవాలి
క్రిమియాతో పాటు మరిన్ని ప్రాంతాలను రష్యా భూభాగంలో కలిపేయాలి
ఉక్రెయిన్ ఏ సైనిక కూటమిలో చేరకూడదు
రష్యన్‌ను అధికార భాషగా గుర్తించాలి
రష్యాపై అంతర్జాతీయ ఆంక్షలు ఎత్తివేయాలి
Russia Ukraine Conflict
Ukraine Russia peace talks
Istanbul talks
Russia conditions
Rustem Umerov
Prisoner exchange
Ceasefire
Crimea
Military alliance
Russian language

More Telugu News