పాపం రోహిత్‌.. బ్యాట్ల‌న్నీ ఇచ్చేశాడు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన ఎంఐ!

  • ముంబై ఇండియన్స్ స్టార్‌ ప్లేయర్ సరదా ఫిర్యాదు
  • సహచర ఆటగాళ్లు తన బ్యాట్లు తీసుకున్నారని ఆవేదన
  • ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అభిమానులతో పంచుకున్న వైనం
ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో అద్భుతంగా రాణించిన ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) ఎలిమినేట‌ర్ గండంను దాటి.. క్వాలిఫ‌య‌ర్‌-2లో బోల్తా ప‌డింది. పంజాబ్ చేతిలో ఓట‌మితో ఇంటిముఖం ప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆఖ‌రి మ్యాచ్ త‌ర్వాత ముంబ‌యి డ్రెస్సింగ్ రూమ్‌లోని దృశ్యాల‌ను ఆ జ‌ట్టు సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. 

ఎంఐ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ‌ను చుట్టుముట్టి ఆటోగ్రాఫులు అడుగుతూ క‌నిపించారు. వారికి త‌న బ్యాట్లు, జెర్సీలు ఇచ్చి, వాటిపై హిట్‌మ్యాన్ ఆటోగ్రాఫ్ చేశారు. ఆఖ‌ర్లో స్పిన్న‌ర్ క‌ర‌ణ్ శ‌ర్మ రోహిత్‌ను అత‌ని బ్యాట్ కావాల‌ని అడిగాడు. దాంతో రోహిత్‌... "నా దగ్గర ఇప్పుడు బ్యాట్ లేదు. అందరూ ఆరు బ్యాట్లు తీసుకున్నారు. బ్యాగ్ నిండా బ్యాట్లు ఉండాల్సింది ఆఖ‌రికి మూడే మిగిలాయి యార్" అంటూ స‌ర‌దాగా చెప్పిన మాటలు ఈ వీడియోలో ఉన్నాయి. 

ఈ చిన్న వీడియో అనూహ్యమైన స్పందన దక్కించుకుంది. దీనికి ఏకంగా 6.81ల‌క్ష‌ల‌కు పైగా లైకులు, రెండు వేలకు పైగా కామెంట్లు రావడం విశేషం. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైనశైలిలో స్పందిస్తున్నారు. జట్టు సభ్యుల మధ్య ఉండే అనుబంధాన్ని, ఆటగాళ్ల వ్యక్తిగత సరదా కోణాలను ఆవిష్కరించే వీడియో అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


More Telugu News