Revanth Reddy: రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ. కోటి చొప్పున అందుకున్నవారు వీరే!

Revanth Reddy Honors Nine with Rs 1 Crore Awards

  • సాహితీ, కళా రంగాల్లో విశేష సేవలందించిన వారికి పురస్కారాలు
  • తొమ్మది మంది ప్రముఖులకు నగదు పురస్కారాలను అందించిన ప్రభుత్వం
  • మహనీయులను గౌరవించుకోవడం మన బాధ్యత అన్న రేవంత్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సాహితీ, కళా రంగాల్లో విశేష సేవలందించిన తొమ్మిది మంది ప్రముఖులను ఘనంగా సత్కరించింది. ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వీరికి పురస్కారాలు అందజేశారు. ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందించారు.

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలోనూ, సాంస్కృతిక వైభవ వ్యాప్తిలోనూ కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను గౌరవించే ఉద్దేశంతో ఈ పురస్కారాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కా యాదగిరి, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి స్వయంగా సీఎం చేతుల మీడుగా పురస్కారాలు అందుకున్నారు. గోరటి వెంకన్న, గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరిలకు చెందిన పురస్కారాలను వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నుంచి స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయులను గౌరవించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.

Revanth Reddy
Telangana Formation Day
Telangana Awards
Telangana Literature
Ande Sri
Gaddar
Cultural Awards Telangana
Telangana Poets
Eka Yadagiri
Goreti Venkanna
  • Loading...

More Telugu News