Chandrababu: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం చంద్ర‌బాబు

Chandrababu Naidu Wishes Telangana People on State Formation Day

  • నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
  • ఎక్స్ వేదిక‌గా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విషెస్ తెలిపిన చంద్ర‌బాబు
  • తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటేన‌న్న ఏపీ సీఎం

ఏపీ సీఎం చంద్ర‌బాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే త‌న‌ ఆకాంక్ష అని ఆయ‌న ట్వీట్ చేశారు. 
 
"తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ  ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ  రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నాను.  

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్ భారత్-2047 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని, తెలుగు జాతి తిరుగులేని శక్తిగా  నిలవాలని.. ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని ఆకాంక్షిస్తున్నాను" అని చంద్ర‌బాబు త‌న 'ఎక్స్' పోస్టులో రాసుకొచ్చారు. 


Chandrababu
Telangana Formation Day
Andhra Pradesh
Telugu People
Telugu States
State Formation Day Wishes
AP CM
Revanth Reddy
  • Loading...

More Telugu News