హైదరాబాద్ లో శ్రీకాకుళంకు చెందిన యువకుడు ఆత్మహత్య

  • భార్యతో గొడవల కారణంగా గచ్చిబౌలిలో చెల్లెలు ఇంట్లో ఉంటున్న శ్రీకాకుళం యువకుడు చిన్న
  • బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
శ్రీకాకుళానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళానికి చెందిన గొట్టివాడ చిన్న (35) అనే వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్యతో విభేదాలు రావడంతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తన చెల్లెలి ఇంట్లో ఉంటున్నాడు.

నిన్న అతను బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News