తలుపులు మూయడం మరవొద్దు.. మెక్రాన్ కు ట్రంప్ సలహా
- మీడియా సమావేశంలో మెక్రాన్ అంశం ప్రస్తావించిన విలేకరి
- ఫన్నీగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు
- ఈ విషయంపై మెక్రాన్ తో మాట్లాడానని చెప్పిన ట్రంప్
ఆ తరువాత ఫొటోల్లో మెక్రాన్, ఎర్రని జాకెట్ వేసుకొని బ్రిగెట్టా విమానం మెట్ల వరుసపై కనిపించారు. దీంతో మెక్రాన్ ను ఆయన భార్య బ్రిగెట్టా తోసేసిందని, వారిద్దరి మధ్య పొసగడంలేదని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఘటనపై స్పందించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మీడియా కోరగా.. ఈ విషయంపై తాను మెక్రాన్ తో మాట్లాడానని, అంతా సవ్యంగానే ఉందని ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత మెక్రాన్ కు ఫన్నీగా ఓ సలహా కూడా ఇచ్చారు. ‘ఇలాంటి సందర్భాలలో తలుపులపై ఓ కన్నేసి ఉంచాలి, డోర్లు మూసేయడం మరిచిపోవద్దు’ అంటూ ట్రంప్ చమత్కరించారు.