ఇప్పుడు అంతా చీకటైపోయింది: గాయని సుశీల
- ఘంటసాల పాటల్లో మాధుర్యం
- బాలు పాటలలో హుషారు
- ఆర్టిస్టులు పాటల రికార్డింగ్ కి వచ్చేవారన్న సుశీల
- ఆ రోజులు వేరంటూ వెల్లడి
తెలుగు సినిమా పాటను తేనెతో అభిషేకించిన గాయనీమణి సుశీల. కొన్ని తరాలను ప్రభావితం చేసిన స్వరం ఆమె సొంతం. కమ్మని పాటల కోయిలమ్మగా ఆమెను గురించి చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సుశీల తాజాగా 'పాప్ కార్న్' అనే యూ ట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
" అటు ఘంటసాల గారితోను .. ఇటు బాలూగారితోను కలిసి నేను పాడాను. అలా పవిత్రమైన పాటలను .. హుషారైన పాటలను పాడే అవకాశం నాకు లభించింది. ఘంటసాల గారు పాడితే ఎన్టీఆర్ గారికి .. ఏఎన్నార్ గారికి సరిగ్గా సరిపోయేది. ఆ తర్వాత బాలూగారు కూడా అలాగే మెప్పించారు. బాలూగారు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. చివరి నిమిషం వరకూ పాటల పట్ల తన ప్రేమను కనబరుస్తూనే వచ్చారు. ఆయన పోయిన తరువాత అంతా చీకటైపోయింది" అని అన్నారు.
" అప్పట్లో గాయనీగాయకులు .. ఆర్టిస్టులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. సింగర్స్ కొన్ని పదాలను ఎలా పలుకుతున్నారు .. ఏ ఎక్స్ ప్రెషన్ అక్కడ అవసరమవుతుంది అనేది తెలుసుకోవడానికి అప్పుడప్పుడు సావిత్రి గారు .. జమునగారు రికార్డింగ్ థియేటర్ కి వచ్చేవారు. 'భక్త ప్రహ్లాద' సినిమాలో నేను రోజా రమణికి పాడుతుంటే, ఆ పాపను తీసుకొచ్చి రికార్డింగ్ థియేటర్లో కూర్చోబెట్టేవారు. అంతటి అంకితభావం ఆ రోజుల్లో ఉండేది" అని చెప్పారు.