Big Ben Movie: ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు .. ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్!

- మలయాళంలో రూపొందిన 'బిగ్ బెన్'
- యూకే నేపథ్యంలో నడిచే కథ
- ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి
- ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే కంటెంట్ కి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ సినిమాలకి ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. అందువలన ఈ జోనర్ నుంచి ఎక్కువ సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా వదులుతున్నారు. అలా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో సినిమానే 'బిగ్ బెన్'. క్రితం ఏడాది జూన్ లో థియేటర్లకు వచ్చిన సినిమా ఇది.
అనూ మోహన్ .. అదితి రవి .. మియా జార్జ్ .. వినయ్ పోర్ట్ ప్రధానమైన పాత్రలను పోషించారు. బినో అగస్టీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కైలాష్ మీనన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఐ ఎమ్ డీ బీలో 7.4 రేటింగ్ ను సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ సినిమాను అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కథ విషయానికి వస్తే, జీన్ ఆంటోని .. లవ్లీ భార్యాభర్తలు .. వారి సంతానమే ఒక పాప. జాబ్ నిమిత్తం లవ్ లీ యూకే వెళ్లవలసి వస్తుంది. తోడుగా ఆంటోని కూడా ఆమెతో పాటు వెళతాడు. లవ్ లీ పట్ల ఆమె బాస్ విల్సన్ అసభ్యంగా ప్రవర్తించడంతో, అతనిపై ఆంటోని చేయి చేసుకుంటాడు. దాంతో అతను అరెస్టు అవుతాడు. అదే సమయంలో పాప సంరక్షణ సరిగ్గా లేదని చెప్పి చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పాపను తీసుకుని వెళ్లిపోతారు. ఒంటరిగా మిగిలిపోయిన లవ్ లీ ఏం చేస్తుంది? అనేది కథ.