ముంబ‌యిలో 'ఓజీ' షూటింగ్‌.. స్టైలిష్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన ప‌వ‌న్‌.. ఇదిగో వీడియో

  • సుజిత్, ప‌వ‌న్ కల్యాణ్ కాంబోలో 'ఓజీ'
  • ప‌వ‌ర్‌ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్న ప‌వ‌న్‌
  • మూవీ షూటింగ్‌లో భాగంగా ముంబ‌యి వీధుల్లో పవన్ సందడి 
  • ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్
  • సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం జెట్ స్పీడ్‌తో తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్ప‌టికే 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని జూన్ 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఇక మరో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’. ఇందులో పవన్ ప‌వ‌ర్‌ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియో సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే’ అంటూ సాగే పాట‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. 

ఇక ఈ మూవీ షూటింగ్ విషయానికి వ‌స్తే.. ప్రస్తుతం ‘ఓజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది చివరి దశకు చేరుకుంది. కొన్ని సన్నివేశాలు పవన్ పై చిత్రీకరించి షూటింగ్‌ను క్లోజ్ చేయనున్నారు. ఇందులో భాగంగానే తాజా షూటింగ్‌లో పవన్ పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో జ‌రుగుతోంది. దీంతో ముంబ‌యి వీధుల్లో పవన్ సందడి చేశారు. గ్యాంగ్ స్ట‌ర్ గా కొత్త లుక్‌లో ప‌వ‌ర్‌స్టార్‌ అదరగొట్టారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

యువ ద‌ర్శ‌కుడు సుజిత్ తెర‌కెక్కిస్తున్న ఓజీలో ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ప్రియాంక మోహ‌న్ న‌టిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌లే మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 




More Telugu News