ఈ వారం ఓటీటీ బరిలోకి క్రేజీ మూవీస్!
- ఈ నెల 28 నుంచి జీ 5లో కన్నడ 'అజ్ఞాతవాసి'
- 29వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో నాని 'హిట్ 3'
- జియో హాట్ స్టార్ లో ఈ నెల 30 నుంచి 'తుడరుమ్'
- 31వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో 'రెట్రో'
థియేటర్లలో విడుదలైన సినిమాలు ఒక నెలకి అటు ఇటుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడం కామన్ గా జరుగుతూనే ఉంది. అయితే ఈ వారం మాత్రం ఈ విషయంలో కాస్త ప్రత్యేకత ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వారం ఓటీటీకి వస్తున్న సినిమాలన్నీ, థియేటర్ల దగ్గర సందడి చేసినవే కావడం విశేషం. దక్షిణాదికి సంబంధించి ఒక్కో వైపు నుంచి ఒక్కో సినిమా రావడం మరో విశేషం.
నాని హీరోగా ఇటీవల థియేటర్లకు వచ్చిన సినిమా 'హిట్ 3'. ఆయన సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదే ఓటీటీలో 31వ తేదీన 'రెట్రో' పలకరించనుంది. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది. సూర్య - పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 1న థియేటర్లకు వచ్చింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ, థియేటర్స్ నుంచి మంచి వసూళ్లనే రాబట్టింది. మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'తుడరుం' అక్కడ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. శోభన కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 30 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక కన్నడలో హిట్ కొట్టిన 'అజ్ఞాతవాసి' ఈ నెల 28 నుంచి 'జీ 5'లో అందుబాటులోకి వచ్చేసిన సంగతి తెలిసిందే.
నాని హీరోగా ఇటీవల థియేటర్లకు వచ్చిన సినిమా 'హిట్ 3'. ఆయన సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 29వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇదే ఓటీటీలో 31వ తేదీన 'రెట్రో' పలకరించనుంది. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా ఇది.