Tirumala: తిరుమల వసతి గృహంలో చోరీ

Theft in Tirumala Accommodation Room
--
తిరుమలలో భక్తుల నగలు చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విష్ణు నివాసంలోని గదిలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనలో 16 గ్రాముల బంగారు నగలు దొంగలు ఎత్తుకెళ్లారని హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన శ్రీదేవి తెలిపారు. శ్రీవారి దర్శనానికి కుటుంబంతో వెళ్లిన శ్రీదేవి.. విష్ణు నివాసంలోని రూమ్ నెంబర్ 613 లో వసతి పొందారు. స్వామి వారి దర్శనానికి వెళ్లి వచ్చి గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగిందని ఆమె తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఆభరణాలను చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tirumala
Tirumala theft
Theft in Tirumala
Sridevi
Vishnu Nivasam
Kukatpally
Hyderabad
Tirumala Accommodation
Gold theft

More Telugu News