'క‌న్న‌ప్ప' నుంచి శ్రీ కాళహస్తి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో విడుద‌ల‌

  • మంచు విష్ణు, ముఖేశ్ కుమార్ సింగ్ కాంబోలో 'క‌న్న‌ప్ప‌'
  • మే 28న శ్రీ కాళహస్తి స్థలపురాణాన్ని వివరించే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల
  • తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేసిన మేక‌ర్స్ 
  • ఈ సాంగ్‌లో క‌నిపించ‌నున్న‌ విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా
మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ డైరెక్ట‌ర్ ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం 'క‌న్న‌ప్ప'. ఈ సినిమా జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్లు, ట్రైల‌ర్‌, పోస్ట‌ర్లు, పాట‌లు క‌న్న‌ప్పపై భారీ అంచ‌నాలు నెల‌కొల్పాయి. ఇక‌, ఈ మూవీ ద్వారా మోహ‌న్ బాబు మ‌న‌వ‌రాళ్లు, విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా కూడా తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. 

ఇప్పటికే వారి తాలూకు పోస్ట‌ర్ల‌ను చిత్రం యూనిట్ విడుద‌ల చేసింది. ఇక‌, ఈ ఇద్ద‌రు సిస్ట‌ర్ల గురించి ఇటీవ‌ల మోహ‌న్ బాబు  ఆస‌క్తిక‌ర అప్‌డేట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో భాగంగా ఈ సోద‌రిమ‌ణులు శ్రీ కాళహస్తి స్థలపురాణాన్ని వివరించే లిరికల్ వీడియోను మే 28న విడుదల చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇందులో భాగంగా తాజాగా శ్రీ కాళహస్తి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళం భాష‌ల్లో రేపు (బుధ‌వారం) ఈ పాట విడుద‌ల కానుంది.  

కాగా, ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్ర‌లో కనిపించనున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ త‌దిత‌రులు ఇత‌ర‌ కీలక పాత్రలు పోషించారు.



More Telugu News