బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఖరారు!
- జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
- హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదిక
- బత్తిని సోదరులు నిర్వహించనున్న కార్యక్రమం
ఈ ఏడాది జూన్ నెల 8, 9 తేదీల్లో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఆ రెండు రోజులూ అక్కడే ప్రసాద వితరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను బత్తిని కుటుంబ సభ్యులు పర్యవేక్షించనున్నారు.