Abhishek Banerjee: అమెజాన్ ప్రైమ్ లో యాక్షన్ థ్రిల్లర్!

Stolen Movie Review
షార్ట్స్‌లో చూడండి
అభిషేక్ బెనర్జీ ప్రధానమైన పాత్రను పోషించిన 'మీర్జా పూర్' ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆయన నుంచి రావడానికి 'స్టోలెన్' సిద్ధమవుతోంది. తేజ్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అనురాగ్ కశ్యప్ .. కిరణ్ రావ్ .. నిఖిల్ అద్వాని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. 

జూన్ 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన ఈ సినిమా, ఎన్నో ప్రశంసలను అందుకుంది. కేరళలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. శుభమ్ తో పాటు హరీశ్ ఖన్నా .. మియా మల్జేర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

గౌతమ్ - రామన్ ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్ల కళ్లముందే ఒక పాపను కొంతమంది దుండగలు అపహరిస్తారు. అన్నదమ్ములిద్దరూ ఆ పాపను రక్షించాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లిద్దరూ ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? అనేది మిగతా కథ. జూన్ 4న రానున్న ఈ  సినిమా, ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.

Go Back to Shorts
Abhishek Banerjee
Stolen Movie
Amazon Prime
Tejpal Shetty
Anurag Kashyap
Kiran Rao
Nikhil Advani
Action Thriller Movie
Mirzapur Actor

More Telugu News