పోలీసులతో వాగ్వాదానికి దిగిన వల్లభనేని వంశీ భార్య
- గుంటూరు జీజీహెచ్ లో వంశీకి వైద్య చికిత్స
- భర్తను కలిసేందుకు వచ్చిన పంకజశ్రీ
- వంశీని కలవకుండా అడ్డుకున్న పోలీసులు
ఈ విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా చూసేందుకు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకున్నారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంశీని కలిసేందుకు పంకజశ్రీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం వంశీకి వైద్యం అందిస్తున్నారని, ఈ సమయంలో ఎవరినీ కలిసేందుకు అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులకు, పంకజశ్రీకి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అయినప్పటికీ, పోలీసులు ఆమెను లోనికి అనుమతించకపోవడంతో, పంకజశ్రీ ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్దే ఉండిపోయారు.