పోలీసుల ఎన్‌కౌంటర్‌లో రూ.5 లక్షల రివార్డున్న నక్సలైట్ మృతి

Naxalite Manish Yadav Killed in Police Encounter in Jharkhand
  • ఝార్ఖండ్‌లోని లాతేహార్‌లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్‌కౌంటర్
  • మనీశ్ యాదవ్ మృతి చెందినట్టు పలామూ డీఐజీ ధ్రువీకరణ
  •  రూ.10 లక్షల రివార్డున్న మరో నక్సలైట్ కుందన్ ఖేర్వార్ అరెస్ట్
  • రెండు ఎక్స్ 95 ఆటోమేటిక్ రైఫిళ్లు స్వాధీనం
ఝార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో కీలక నక్సలైట్ ఒకరు మరణించారు. మరో నక్సలైట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు లాతేహార్ పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో రూ.5 లక్షల రివార్డు ఉన్న మనీశ్ యాదవ్ అనే నక్సలైట్ మరణించినట్టు పలామూ డీఐజీ వైఎస్ రమేశ్ ధ్రువీకరించారు. మనీశ్ యాదవ్ చాలా కాలంగా పలు హింసాత్మక ఘటనల్లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా తలపై రూ. 10 లక్షల రివార్డు ఉన్న కుందన్ ఖేర్వార్ అనే మరో నక్సలైట్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి రెండు అత్యాధునిక ఎక్స్ 95 ఆటోమేటిక్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఎదురుకాల్పుల ఘటన మహుదానర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరమ్‌ఖాడ్, దౌనా గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాలను జల్లెడ పడుతూ, ఇంకా ఎవరైనా నక్సలైట్లు నక్కి ఉన్నారేమోనని తనిఖీలు నిర్వహిస్తున్నారు. 
Go Back to Shorts
Manish Yadav
Jharkhand
Naxalite
encounter
Latehar
police
Kundan Kherwar
crime
extremism

More Telugu News