పోలీసుల ఎన్‌కౌంటర్‌లో రూ.5 లక్షల రివార్డున్న నక్సలైట్ మృతి
- ఝార్ఖండ్‌లోని లాతేహార్‌లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్‌కౌంటర్
- మనీశ్ యాదవ్ మృతి చెందినట్టు పలామూ డీఐజీ ధ్రువీకరణ
- రూ.10 లక్షల రివార్డున్న మరో నక్సలైట్ కుందన్ ఖేర్వార్ అరెస్ట్
- రెండు ఎక్స్ 95 ఆటోమేటిక్ రైఫిళ్లు స్వాధీనం
ఈ ఆపరేషన్‌లో భాగంగా తలపై రూ. 10 లక్షల రివార్డు ఉన్న కుందన్ ఖేర్వార్ అనే మరో నక్సలైట్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఘటనా స్థలం నుంచి రెండు అత్యాధునిక ఎక్స్ 95 ఆటోమేటిక్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఎదురుకాల్పుల ఘటన మహుదానర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరమ్‌ఖాడ్, దౌనా గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాలను జల్లెడ పడుతూ, ఇంకా ఎవరైనా నక్సలైట్లు నక్కి ఉన్నారేమోనని తనిఖీలు నిర్వహిస్తున్నారు.