Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం

Vizag Steel Plant Fire Accident in Visakhapatnam
  • స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో చెలరేగిన మంటలు
  • ఆయిల్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణ
  • భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ లోని స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2 (ఎస్ఎంఎస్-2) విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగలు అలుముకున్నాయి.

ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్ఎంఎస్-2లోని ఒక పైప్‌లైన్ దెబ్బతినడంతో ఆయిల్ లీకై మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీమ్‌లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాద తీవ్రత, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Vizag Steel Plant
Visakhapatnam Steel Plant
Steel Plant Fire Accident
SMS-2
Steel Melting Station
Fire Accident
Visakhapatnam
Andhra Pradesh
Industrial Accident

More Telugu News