అమరావతిలోని నిధి భవన్ లో అగ్ని ప్రమాదం
- ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్
- భయంతో కిందికి పరుగులు తీసిన ఉద్యోగులు
- షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనా
మంటలు ఎగిసిపడడంతో కంప్యూటర్లు కాలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు నిధి భవన్ లోనే ఉంటాయి. ఆన్ లైన్ వ్యవస్థే అయినప్పటికీ కంప్యూటర్లు మొత్తం కాలిపోవడంతో సమాచారం కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, అగ్ని ప్రమాదంతో ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు.