Bhagyashree Borse: ఇప్పుడిక భాగ్యశ్రీదే హవా!

Bhagyasree Borse Special
  • యూత్ లో విపరీతమైన క్రేజ్ 
  • జోరు పెంచుతున్న భాగ్యశ్రీ 
  • స్టార్ హీరోల సినిమాల నుంచి ఆఫర్లు 
  • ఇక్కడ చక్రం తిప్పే ఛాన్స్  

భాగ్యశ్రీ బోర్సే .. ఇప్పుడు ఈ పేరు కుర్రకారు నోళ్లల్లో నానుతోంది. ఆకర్షణీయమైన ఆమె రూపం అటు హంసలతోను .. ఇటు నెమళ్లతోను పోటీపడుతూ ఉంటుంది. చందమామలాంటి ఈ అమ్మాయికి విశాలమైన కళ్లే ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేష్ టాలీవుడ్ కి గ్లామర్ డోస్ ఇస్తున్న సమయంలో, కృతి శెట్టి - శ్రీలీల చాలా వేగంగా తెలుగు తెరను ఆక్రమించారు. తొలి సినిమాలతోనే భారీ హిట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఈ రెండు వరుసలలోని హీరోయిన్స్ లో కొంతమందికి వరుస ఫ్లాప్ లు పడటం .. మరికొందరికి గ్యాప్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భాగ్యశ్రీ బోర్సే 'మిస్టర్ బచ్చన్' సినిమాతో ఇక్కడి యూత్ కళ్లలో పడింది. వెండితెరకి కొత్త పండుగ తెచ్చినట్టుగా భాగ్యశ్రీ కనిపించడంతో, కుర్రాళ్లంతా మనసులు పారేసుకున్నారు. యూత్ లో ఆమెకి గల క్రేజ్, ఇప్పుడు వరుస అవకాశాలు తెచ్చిపడేస్తోంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ సుందరి వరుస సినిమాలలో సందడి చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

విజయ్ దేవరకొండ జోడిగా భాగ్యశ్రీ చేసిన 'కింగ్ డమ్', జులైలో థియేటర్లకు రానుంది. సితార బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆమె చాలానే ఆశలు పెట్టుకుంది. రామ్ జోడీగా కూడా ఆమె ఒక సినిమా చేయనుంది. మహేశ్ బాబు పి. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆమె మరింత గ్లామరస్ గా మెరవనున్నట్టు తెలుస్తోంది. ఇక దుల్కర్ సరసన 'కాంత' చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇలా వరుస ప్రాజెక్టులతో ప్రస్తుతం భాగ్యశ్రీ బిజీ. ఈ సినిమాలు హిట్ కొడితే ఇక ఈ బ్యూటీని పట్టుకోవడం కష్టమే. 


Bhagyashree Borse
Bhagyashree Borse movies
Vijay Deverakonda
Kingdom movie
Tollywood actress
Telugu cinema
Glamour
Sreeleela
Kriti Shetty
Gautam Tinnanuri

More Telugu News