విశాఖ డిప్యూటీ మేయ‌ర్ అభ్య‌ర్థిగా ద‌ల్లి గోవింద్‌

  • జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్‌ను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఖరారు
  • సీల్డ్ కవర్ లో గోవింద్ పేరును పంపిన జనసేన అధిష్ఠానం
  • ఇవాళ విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలు
విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థి పేరును కూటమి ప్రభుత్వం వెల్లడించింది. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్‌ను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కూటమి ఖరారు చేసింది. సీల్డ్ కవర్ లో గోవింద్ పేరును జనసేన అధిష్ఠానం పంపింది. ఇవాళ విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. 

కాగా, వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. శ్రీధర్ అవిశ్వాసం ద్వారా వైదొలగడంతో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది.


More Telugu News