టీడీపీ నేతపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడి
- ఉద్దండ్రాయునిపాలెంలో ఘటన
- రాజు అనే స్థానిక టీడీపీ నేతపై సురేశ్, ఆయన సోదరుడు ప్రభుదాసు దాడి
- తీవ్రంగా గాయపడ్డ రాజు మంగళగిరిలోని ఎయిమ్స్‌లో చికిత్స
- బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి ఘటన
ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన బయటకు వచ్చింది. కాగా, అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ దాదాపు మూడు నెలలు జైలులో ఉన్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు టీడీపీ నేతపై దాడితో మరోసారి వార్తల్లో నిలిచారు.