మ‌రో 10 రోజుల్లో కేర‌ళ‌ను తాక‌నున్న నైరుతి రుతుప‌వ‌నాలు

  
నైరుతి రుతుప‌వ‌నాలు మ‌రో 10 రోజుల్లో కేర‌ళ‌ను తాక‌నున్నాయ‌ని భారత వాతావరణ శాఖ (IMD) వెల్ల‌డించింది. వాస్త‌వానికి ఇవి ఈ నెల 22న అండ‌మాన్‌ను, 26న శ్రీలంక‌ను తాకొచ్చ‌ని భావించ‌గా... అందుకు ప‌ది రోజుల ముందుగానే శ్రీలంక‌లోకి ప్ర‌వేశించాయి. ప్ర‌స్తుతం శ్రీలంక అండమాన్‌ల‌లో విస్త‌రించాయి.

తాజాగా ఈనెల 27 నాటికి కేర‌ళ‌ను తాకే అవ‌కాశం క‌నిపిస్తోందని ఐఎండీ వెల్ల‌డించింది. అంతేగాక రాబోయే రోజుల్లో మ‌రింత వేగంగా క‌ద‌ల‌డానికి అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయని తెలిపింది. మ‌రోవైపు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. దీని ప్ర‌భావంతో రాగ‌ల మూడు రోజుల్లో రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ చెప్పింది.  




More Telugu News