మెరుగైన వైద్యం కోసం అమెరికాకు కొడాలి నాని?
- నానికి ముంబైలో గుండె ఆపరేషన్
- ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో విశ్రాంతి
- సన్నిహితులను మాత్రమే కలుస్తున్నట్లు సమాచారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) మెరుగైన వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు. హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మరింత మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలిసింది. నాని తనకు అత్యంత సన్నిహితులైన కొద్దిమందిని తప్ప, ఇతరులెవరినీ కలవడం లేదని సమాచారం. ఆయన ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు, అభిమానులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, ఆయనపై గతంలో వచ్చిన కొన్ని ఆరోపణలు కూడా చర్చనీయాంశమయ్యాయి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన సమయంలో కొడాలి నాని ప్రతిపక్షాలపై తీవ్రమైన పదజాలంతో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆ కాలంలో ఆయనపై మట్టి, ఇసుక అక్రమ రవాణా వంటి పలు వ్యవహారాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణల నేపథ్యంలో కొడాలి నాని అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.