Jayam Ravi: జయం రవి కుటుంబ వివాదం: అత్తగారి సంచలన ఆరోపణలు!
- రవిపై అత్త, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ సంచలన ఆరోపణలు
- రవి ప్రోత్సాహంతోనే సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చానని వెల్లడి
- సినిమాల కోసం రూ.100 కోట్లు అప్పు చేశానన్న సుజాత
- అప్పులు తీర్చడంలో రవి సాయం చేయలేదని ఆవేదన
- సానుభూతి కోసం రవి ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్య
ప్రముఖ నటుడు జయం రవి కుటుంబంలో నెలకొన్న వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే ఆయన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా, తాజాగా ఆయన అత్త, సినీ నిర్మాత సుజాత విజయ్‌కుమార్ తీవ్ర ఆరోపణలతో ఒక ప్రకటన విడుదల చేశారు. జయం రవి ప్రవర్తన వల్లే తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జయం రవి ప్రోత్సాహంతోనే తాను సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని సుజాత విజయ్‌కుమార్ వెల్లడించారు. తన అల్లుడిని కొడుకులా భావించానని, ఆయన హీరోగా 'అడంగ మరు', 'భూమి', 'సైరన్' వంటి చిత్రాలను నిర్మించానని పేర్కొన్నారు. ఈ సినిమాల నిర్మాణం కోసం ఫైనాన్షియర్ల నుంచి సుమారు రూ.100 కోట్లు అప్పు తీసుకున్నానని, అందులో 25 శాతం జయం రవికే పారితోషికంగా ఇచ్చానని ఆమె వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.
"అప్పుల కారణంగా నేను ప్రశాంతత లేని జీవితాన్ని గడిపాను. వడ్డీలు నేనొక్కదాన్నే చెల్లించేదాన్ని. నష్టాలను పూడ్చడానికి నా బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తానని ‘సైరన్’ సమయంలో అతడు మాటిచ్చాడు. కానీ, ఏ చిత్రానికీ సంతకం చేయలేదు. అంతేకాకుండా, అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు" అని సుజాత తన ప్రకటనలో ఆరోపించారు. జయం రవి తనను 'అమ్మ' అని ప్రేమగా పిలిచేవాడని, కానీ ఇప్పుడు సానుభూతి కోసం అతడు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే బాధగా ఉందని, హీరో అనే భావన పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతడు ఎప్పుడూ హీరోగానే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.