లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ను చట్టం ముందు నిలబెట్టాలి: డొక్కా మాణిక్య వరప్రసాద్
- లిక్కర్ స్కామ్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న డొక్కా
- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపాటు
- ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే శక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవ్వాలని వేంకటేశ్వరస్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. ఈరోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను తాజాగా అరెస్ట్ చేశారు.