Anitha: మరోసారి మానవత్వం చాటుకున్న అనిత
- విశాఖలోని తాడిచెట్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదం
- అచేతన స్థితిలో ఉన్న యువకుడిని గమనించి కాన్వాయ్ ఆపించిన అనిత
- తక్షణమే ఆసుపత్రికి తరలించాలని పోలీసులకు ఆదేశం
ఏపీ హోం మంత్రి అనిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖలో ఎయిర్ పోర్టుకు వెళుతుండగా... తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతనంగా పడిపోయిన ఒక యువకుడిని గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ని ఆపించి, సహాయక చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని పోలీసులను ఆదేశించారు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ ఓ వృద్ధురాలికి ధైర్యం చెప్పారు.