Mishra: పోలీస్ అధికారి బదిలీపై వెళుతుంటే ఏడ్చేసిన జనం.. వీడియో ఇదిగో!
––
పోలీసులంటే భయపడేవాళ్లే ఎక్కువ.. కానీ ఓ పోలీస్ అధికారి మాత్రం ప్రజల్లో విపరీతమైన అభిమానం సంపాదించుకున్నాడు. ఎంతగా అంటే ఆయన బదిలీ అయి వెళ్లిపోతుంటే జనం వెక్కి వెక్కి ఏడ్చేంతగా. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమే. నార్త్ ఢిల్లీలోని సబ్జీమండి పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్వోగా విధులు నిర్వహిస్తున్న మిశ్రాకు ఇటీవల బదిలీ అయింది. దీంతో స్టేషన్ లోని సిబ్బందికి వీడ్కోలు పలికి వీధిలోకి రాగానే జనం ఆయనను చుట్టుముట్టారు. ఇక్కడే ఉండాలని, బదిలీపై వెళ్లొద్దని అడ్డుకున్నారు. కొందరైతే మిశ్రాను కౌగిలించుకుని ఏడ్వడం మొదలుపెట్టారు. తమకోసం 24 గంటలూ పనిచేసే మంచి పోలీస్ అని, ఆయన బదిలీని రద్దు చేయాలని మీడియా ద్వారా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. మిశ్రా తన సేవలతో సబ్జీమండి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.