అక్ష‌య్ కుమార్ ‘కేస‌రి 2’ తెలుగు ట్రైల‌ర్ చూశారా?

  • జలియన్‌ వాలాబాగ్ ఉదంతం త‌ర్వాతి ప‌రిణామాల‌కు సంబంధించి ‘కేస‌రి చాప్టర్ 2’
  • ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన అక్ష‌య్ కుమార్ 
  • క‌ర‌ణ్ సింగ్ త్యాగీ ద‌ర్శ‌క‌త్వం.. ధ‌ర్మ ప్రొడక్షన్ బ్యాన‌ర్ నిర్మాణం
  • ఏప్రిల్ 18న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన మూవీ, మంచి రెస్పాన్స్‌
  • ఈ నెల 23న తెలుగులో విడుద‌ల చేస్తున్న మేక‌ర్స్
భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన, హేయమైన సంఘటనగా నిలిచిపోయిన ఘ‌ట‌న‌ల‌లో జలియన్ వాలాబాగ్ ఉదంతం ఒక‌టి. బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఉదంతం త‌ర్వాత జ‌రిగిన ప‌రిణ‌మాల‌కు సంబంధించి ‘కేస‌రి చాప్టర్ 2’ అనే బాలీవుడ్ మూవీ వ‌చ్చింది. అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ జలియన్‌ వాలాబాగ్‌ అనేది ట్యాగ్‌లైన్‌. 

ఇందులో న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. అలాగే మాధ‌వ‌న్, అన‌న్య పాండే, రెజీనా క‌సాండ్రా ఇత‌ర‌ కీల‌క పాత్ర‌లు పోషించారు. క‌ర‌ణ్ సింగ్ త్యాగీ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ ధ‌ర్మ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌ క‌ర‌ణ్ జోహార్ నిర్మించారు. 

ఏప్రిల్ 18న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు కూడా రాబ‌ట్టింది. అయితే, ఈ చిత్రానికి వ‌చ్చిన మంచి స్పంద‌న‌ కార‌ణంగా తాజాగా సినిమాను  మేక‌ర్స్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మే 23న ఇది తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రం యూనిట్‌ తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది.



More Telugu News