Shehbaz Sharif: భార‌త్ దెబ్బ‌... నిజం ఒప్పుకున్న పాకిస్థాన్‌

India Strikes Back Pakistan Admits to Missile Damage
  • ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా భార‌త్ ప్ర‌తీకారం
  • వ‌ణికిపోయిన దాయాది పాకిస్థాన్‌
  • అయితే, త‌మ‌కు జ‌రిగిన న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ఇన్నాళ్లు బుకాయించిన పాక్
  • భార‌త మిస్సైల్స్ దెబ్బ త‌మ‌కు త‌గిలింద‌ని తాజాగా చెప్పిన పాక్ ప్ర‌ధాని
ఏప్రిల్ 22న ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడితో అమాయ‌కులైన 26 మంది ప‌ర్యాట‌కుల ప్రాణాలు తీసిన ముష్క‌రుల‌పై ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకున్న విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ ఆక్ర‌మిత కశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లో తొమ్మిది ఉగ్ర‌వాద స్థావరాల‌పై భార‌త బ‌ల‌గాలు విరుచుకుప‌డ్డాయి. శ‌త్రువుల కీల‌క‌మైన వైమానిక స్థావ‌రాల‌ను మ‌న క్షిప‌ణులు ధ్వంసం చేశాయి.

అయితే, భార‌త్ దాడుల‌తో త‌మ‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, పైగా విజ‌యం సాధించామ‌ని బుకాయించిన దాయాది పాకిస్థాన్ ఎట్ట‌కేల‌కు నిజం ఒప్పుకుంది. భార‌త మిస్సైల్స్ దెబ్బ త‌మ‌కు త‌గిలింద‌ని తాజాగా ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ నిజం బ‌య‌ట‌పెట్టారు. 

శుక్ర‌వారం రాత్రి ఓ స‌భ‌లో మాట్లాడుతూ... "మే 9-10 మ‌ధ్య‌ అర్ధ‌రాత్రి భార‌త్ దాడులు ప్రారంభించిన త‌ర్వాత తెల్ల‌వారుజామున‌ 2.30 గంట‌లకు ఆర్మీ చీఫ్‌ జ‌న‌ర‌ల్ మునీర్ నాకు కాల్ చేసి భార‌త్ బాలిస్టిక్ క్షిప‌ణులు ప్ర‌యోగించింద‌ని చెప్పారు. రావ‌ల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు ఇత‌ర ప్రాంతాలు దాడికి గుర‌య్యాయ‌ని తెలిపారు. ఆప‌రేష‌న్ సిందూర్ ఏ స్థాయికి వెళ్లిందో అప్పుడే అర్థ‌మైంది. ఆ స‌మ‌యంలో పాక్ వైమానిక ద‌ళం సాంకేతిక ప‌రిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించింది. మ‌న ఎయిర్‌ఫోర్స్ దీటుగానే బ‌దులిచ్చింది" అని పాక్ ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. 


Shehbaz Sharif
Pakistan
India
Operation Sundar
Balistic Missiles
Air Strikes
Indo-Pak Relations
Ceasefire
Surgical Strikes
Nuclear Weapons

More Telugu News