చంద్ర‌బాబు బ్రాండ్‌తోనే ఏపీలో పెట్టుబ‌డులు: మంత్రి లోకేశ్‌

  • కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక‌ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయన్న‌ మంత్రి 
  • బేత‌ప‌ల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్‌కు మంత్రి లోకేశ్ భూమిపూజ
  • 2,300 ఎక‌రాల్లో రూ.22వేల కోట్ల‌తో రెవెన్యూ విద్యుత్ కాంప్లెక్స్‌ ఏర్పాటు
కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఏపీకి వివిధ సంస్థ‌లు భారీ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి సీఎం చంద్ర‌బాబు బ్రాండే దోహ‌ప‌డింద‌న్నారు. అనంత‌పురం జిల్లా గుత్తి మండ‌లం బేత‌ప‌ల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్‌కు శుక్ర‌వారం నాడు మంత్రి లోకేశ్ భూమిపూజ చేశారు. 2,300 ఎక‌రాల్లో రూ.22 వేల కోట్ల‌తో దీన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... రాయ‌ల‌సీమ‌లో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో ప‌దివేల మందికి ఉద్యోగాలు క‌ల్పించే బాధ్య‌త తీసుకుంటామ‌ని లోకేశ్ చెప్పారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువ‌త‌కు 20 లక్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని తెలిపారు. 

ఏపీ గ‌డ్డ‌పై ఉత్ప‌త్తి అయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా... దేశ అవ‌స‌రాల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డనుంద‌ని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టుల‌తో విద్యుత్ ఛార్జీలు త‌గ్గించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం రోడ్ల‌పై గుంత‌ల‌ను పూడ్చలేక‌పోయింద‌ని దుయ్య‌బ్ట‌టారు. ఒక్క పెట్టుబ‌డి కూడా తీసుకురాలేక‌పోయార‌న్నారు. 

అలాంటిది, ఇప్పుడు టీసీఎస్, టాటా ఎన‌ర్జీతో పాటు పలు ప్ర‌ముఖ సంస్థులు పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌ని అన్నారు. త్వ‌ర‌లోనే క‌ర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామ‌ని మంత్రి లోకేశ్ చెప్పారు. 


More Telugu News