Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు న‌మోదు

Bellamkonda Sai Sreenivas Booked by Hyderabad Police

  • జూబ్లీహిల్స్ పీఎస్‌లో శ్రీనివాస్‌పై కేసు న‌మోదు 
  • రాంగ్ రూట్ డ్రైవింగ్, కానిస్టేబుల్‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆయ‌న‌పై కేసు 
  • జూబ్లీహిల్స్ జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ వ‌ద్ద త‌న కారులో రాంగ్ రూట్‌లో వచ్చిన హీరో!

టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ట్రాఫిక్‌లో రాంగ్ రూట్‌లో వెళ్ల‌డ‌మే కాకుండా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆయ‌న‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. కాగా, జూబ్లీహిల్స్ జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ వ‌ద్ద శ్రీనివాస్ త‌న కారులో రాంగ్ రూట్‌లో వచ్చాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విష‌యం తెలిసిందే. 

కాగా, సదరు హీరోను ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుని హెచ్చ‌రించారు. రాంగ్ రూట్‌లో ఎలా వ‌స్తారంటూ కానిస్టేబుల్ ప్ర‌శ్నించ‌డంతో శ్రీనివాస్ అక్క‌డి నుంచి వెన‌క్కి వెళ్లిపోయారు. ఇక‌, ప్ర‌స్తుతం ఈ యువ హీరో నాలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. భైర‌వం, టైస‌న్ నాయుడు, హైంద‌వ‌, కిష్కింధ‌పురి చిత్రాల్లో న‌టిస్తున్నారు. 

Bellamkonda Sai Sreenivas
Tollywood Actor
Traffic Violation
Jubilee Hills Police
Hyderabad Police Case
Wrong Way Driving
Police Complaint
Actor Arrested
Telugu Film Industry
Bairava
Tyson Naidu
Hindava
Kishkindha Puri
  • Loading...

More Telugu News