Urvashi Rautela: కేన్స్ లో ఐశ్వర్య లుక్ ను ఊర్వశి రౌతేలా కాపీ కొట్టిందంటున్న నెటిజన్లు!

Urvashi Rautelas Cannes Look Compared to Aishwarya Rai
  • వేడుకగా ప్రారంభమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 
  • తొలి రోజు ప్రదర్శనలో మల్టీ కలర్ పొడవాటి గౌనును ధరించి రెడ్ కార్పెట్ పై హోయలొలకించిన నటి ఊర్వశి రౌతేలా 
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటోలు
ప్రతిష్ఠాత్మకంగా భావించే 78వ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం ఫ్రాన్స్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాతో పాటు పలు దేశాలకు చెందిన నటీనటులు, మోడళ్లు సందడి చేశారు. పలువురు భామలు డిజైనర్ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై ఆకట్టుకున్నారు.

ఊర్వశి రౌతేలా మల్టీ కలర్ పొడవాటి గౌను ధరించి రెడ్ కార్పెట్‌పై హోయలొలికించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు ఆమె లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

2018లో ఐశ్వర్యారాయ్ సైతం ఇదే తరహాలో మల్టీ కలర్ గౌన్‌ను ధరించడాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య లుక్‌ను ఊర్వశి రౌతేలా కాపీ కొట్టిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మేకప్ ఎక్కువైందని, హెయిర్ స్టైల్ బాగోలేదని విమర్శలు చేస్తున్నారు. 
Urvashi Rautela
Aishwarya Rai
Cannes Film Festival
Bollywood Actress
Red Carpet Look
Viral Photos
Social Media
Fashion
Celebrity Style
Multi-colored Gown

More Telugu News