Samantha: 'శుభం' మూవీపై సమంత తల్లి నినెట్ రూత్ ప్రభు స్పందన

- తన నిర్మాణ సంస్థ ద్వారా సమంత నిర్మించిన తొలి చిత్రం శుభం
- ఇటీవలే థియేటర్లలో రిలీజైన శుభం
- మూవీ చూస్తున్నంత సేపు కడుపుబ్బా నవ్వుకున్నా అని చెప్పిన నినెట్ రూత్ ప్రభు
తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా ప్రముఖ నటి సమంత నిర్మించిన తొలి చిత్రం 'శుభం' ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో వర్ధమాన నటీనటులు ప్రధాన పాత్రలు పోషించగా, సమంత అతిథి పాత్రలో నటించారు.
ఈ సినిమా చూసిన సమంత తల్లి నినెట్ రూత్ ప్రభు స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
"నీ నటన చాలా బాగుంది. అలా హావభావాలు పలికించడం కష్టం. సినిమా చూస్తున్నంతసేపు కడుపుబ్బా నవ్వుకున్నాను" అని నినెట్ వ్యాఖ్యానించారు. తల్లి స్పందనతో పాటు చిత్రబృందం, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలు, థియేటర్లలో ప్రేక్షకుల స్పందనకు సంబంధించిన దృశ్యాలను కూడా సమంత పంచుకున్నారు. 'శుభం'తో అద్భుతమైన ప్రయాణం మొదలైందని సమంత పేర్కొన్నారు.
ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.