లండన్‌లో రామ్‌చరణ్‌ను కలిసిన ప్రఖ్యాత బాక్సర్

  • లండన్ పర్యటనలో ఉన్న రామ్‌చరణ్
  • బాక్సింగ్ బెల్ట్‌ను రామ్‌చరణ్ చేతుల మీదుగా తన భుజంపై వేయించుకున్న ప్రముఖ బాక్సర్ జూలియస్
  • రామ్‌చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న చరణ్ కుటుంబ సభ్యులు
ప్రముఖ నటుడు రామ్ చరణ్‌ను లండన్‌లో ప్రముఖ బాక్సర్ జూలియన్ ఫ్రాన్సిస్ కలిశారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని అక్కడి ప్రఖ్యాత మేడమ్ టూస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్ కుటుంబ సమేతంగా లండన్‌కు వెళ్లారు.

ఈ క్రమంలో బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా ఐదుసార్లు, కామన్వెల్త్ ఛాంపియన్‌గా నాలుగుసార్లు గెలిచిన బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ మంగళవారం రామ్ చరణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా బాక్సింగ్ బెల్ట్‌ను తన భుజంపై వేయమని రామ్ చరణ్‌ను జూలియస్ కోరారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని స్వయంగా చరణ్ చేతుల మీదుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో చరణ్ సతీమణి ఉపాసన, కుమార్తె క్లీంకార, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


More Telugu News