Gidugu Rudra Raju: కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పూర్తయింది: గిడుగు రుద్రరాజు

- హామీల విషయంలో చంద్రబాబు విఫలమయ్యారన్న రుద్రరాజు
- వాగ్దానాలను అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని విమర్శ
- అమరావతికి 7 వేల ఎకరాల స్థలం సరిపోతుందని వ్యాఖ్య
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇచ్చిన వాగ్దానాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు.
అమరావతిలో మళ్లీ భూసేకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని... దీనికి తాము పూర్తిగా వ్యతిరేకమని రుద్రరాజు తెలిపారు. అమరావతి పేరుతో రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతికి 7 వేల ఎకరాల స్థలం సరిపోతుందని... మరోసారి భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు.