పాకిస్థాన్‌కు మ‌రోసారి అస‌దుద్దీన్‌ ఒవైసీ చుర‌క‌లు

      
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి, ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ దాయాది పాకిస్థాన్‌పై విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా పాక్‌కు ఆయ‌న మ‌రోసారి చుర‌క‌లంటించారు. ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్, సైనిక చీఫ్ మునీర్‌ల‌ను ఉద్దేశించి 'ఎక్స్' వేదిక‌గా ఒవైసీ చేసిన పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

"చైనా నుంచి అద్దెకు తెచ్చుకున్న విమానాన్ని పాకిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి ష‌రీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ త‌మ ర‌హీమ్ యార్ ఖాన్ వాయుస్థావ‌రంలో ల్యాండ్ చేయ‌గ‌ల‌రా?" అని ప్ర‌శ్నించారు. ఎందుకంటే ఆ ఎయిర్‌బేస్ ఇటీవ‌ల‌ భార‌త్ చేసిన దాడుల్లో తీవ్రంగా ధ్వంస‌మైంది. ఈ నేప‌థ్యంలోనే పాక్‌ను ఎద్దేవా చేస్తూ ఆయ‌న ఈ ట్వీట్ చేశారు. దీనిపై 'ఎక్స్' యూజ‌ర్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 


More Telugu News