జమ్మూకశ్మీర్‌లో లష్కరే ఉగ్రవాది హతం
- జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఎదురుకాల్పులు
- మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట
- కొనసాగుతున్న భద్రతా దళాల ఆపరేషన్
ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదే ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకుని ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. వారిని పట్టుకునేందుకు లేదా మట్టుబెట్టేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని బలగాలు పూర్తిగా చుట్టుముట్టాయి.