Hanshita Dil Raju: ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన దిల్ రాజు కుమార్తె హన్షిత

- మదర్స్ డే సందర్భంగా ఇంట్లోనే తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రేమను చాటుకున్న దిల్‌రాజు కుమార్తె హన్షిత
- నాలుగు తరాలు అనే క్యాప్షన్‌తో ఇన్ స్టాలో ఫోటో పోస్ట్ చేసిన హన్షిత
- సోషల్ మీడియాలో ఫోటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుమార్తె హన్షిత మదర్స్ డే సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విషయంలోకి వెళితే, హన్షిత తల్లి అనిత కొన్నేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. అయితే తల్లి భౌతికంగా లేకపోయినా ఎప్పటికీ గుర్తుండిపోయేలా హన్షిత ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేసింది. మదర్స్ డే సందర్భంగా తల్లి విగ్రహాన్ని హత్తుకుని తన ప్రేమను చాటుకుంది.
తల్లి విగ్రహం వద్ద కూతురు ఇషితా, అమ్మమ్మతో హన్షిత ఫోటోలు దిగి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ "నాలుగు తరాలు" అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హన్షిత చాటుకున్న తల్లి ప్రేమను నెటిజన్లు అభినందిస్తున్నారు. హన్షిత ప్రస్తుతం నిర్మాతగా పలు సినిమాలు తీస్తున్నారు.
కాగా, అర్ధాంగి అనిత చనిపోయిన తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న దిల్‌రాజు లాక్‌డౌన్ సమయంలో తేజస్వీని (వైఘా రెడ్డి) అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు జన్మించాడు.