రిలయన్స్ జియో రెండు చౌకైన ప్లాన్స్.. కానీ, నో డేటా..!
- కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌తో రెండు చౌకైన ప్లాన్స్
- ఒకటి రూ. 458కి 84 రోజుల వ్యాలిడిటీ
- మరొకటి రూ.1958కే 365 రోజులు చెల్లుబాటు
- రెండు పాత రీఛార్జ్ ప్లాన్స్‌ను తొలగించిన జియో
ఇటీవల ట్రాయ్ (Telecom Regulatory Authority of India-TRAI) అన్ని టెలికాం కంపెనీలను వినియోగదారుల కోసం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లతో కూడిన చౌక రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకురావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా రిలయన్స్ జియో కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్‌తో రెండు చౌకైన ప్లాన్స్‌ని తీసుకొచ్చింది.
జియో ఈ ప్లాన్‌లను కేవలం కాలింగ్, ఎస్‌ఎంఎస్ ఉపయోగిస్తూ.. డేటా అవసరం లేని యూజర్లను దృష్టిలో పెట్టుకొని తీసుకువచ్చింది. ఈ రెండు ప్లాన్లలో ఒకటి రూ. 458కి 84 రోజుల వ్యాలిడిటీ, మరొకటి రూ.1958కే 365 రోజులు చెల్లుబాటుతో వస్తుంది.
రూ. 458కి 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్
జియో కొత్త రూ. 458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దాంతో పాటు యూజర్లు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
రూ. 1958కే 365 రోజుల ప్లాన్
జియో కొత్త రూ. 1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల దీర్ఘకాలిక చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే 3,600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
రెండు పాత రీఛార్జ్ ప్లాన్స్‌ను తొలగించిన జియో
జియో రెండు పాత రీఛార్జ్ ప్లాన్స్‌ను తొలగించింది. ఈ ప్లాన్లు రూ.479, రూ.1899 రీఛార్జ్ ప్లాన్లు. రూ.1899 ప్లాన్‌లో వినియోగదారులకు 336 రోజుల చెల్లుబాటుతో 24జీబీ డేటా లభించగా.,. రూ. 479 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 6 జీబీ డేటాను అందించిన విషయం తెలిసిందే.