పెళ్లిపై స్పందించిన నటుడు సుమంత్

  • నటి మృణాల్ ఠాకూర్, నటుడు సుమంత్ పెళ్లి చేసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో షికారు చేస్తున్న పుకార్లు
  • తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి వార్తలపై స్పందించిన సుమంత్
  • మృణాల్‌తో రిలేషన్స్‌లో లేనని సుమంత్ స్పష్టీకరణ  
  • అసలు పెళ్లి ఆలోచనే లేదన్న సుమంత్
హీరోయిన్ మృణాల్ ఠాకూర్, హీరో సుమంత్ సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారని, వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సుమంత్, మృణాల్ చాలా క్లోజ్‌గా సోఫాలో కూర్చుని దిగిన ఓ ఫోటో లీక్ కావడంతో దాన్ని పోస్ట్ చేస్తూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై వీరు ఇద్దరూ స్పందించకపోవడంతో ఈ వదంతులు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న రూమర్స్‌పై సుమంత్ స్పందించారు. మృణాల్‌తో తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. మృణాల్‌తో తనకు అసలు ఎలాంటి రిలేషన్ లేదని తేల్చి చెప్పారు. 

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటో విషయంపై క్లారిటీ ఇస్తూ.. ఆ ఫోటో సీతారామం మూవీ అప్పటిదని అన్నారు. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ పెళ్లి అంటూ రాస్తున్నారని అన్నారు. సీతారామం తర్వాత ఇద్దరం కలుసుకున్నదీ లేదన్నారు.

ఇదే సందర్భంలో తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పారు. ఇలా ఉండటమే తనకు ఇష్టమని అన్నారు. రొటీన్ లైఫ్ అస్సలు బోర్ కొట్టదని అన్నారు. తాను రోజు ఐదు గంటలు సినిమాలు లేదా ఓటీటీలో బిజీగా ఉంటానని, ఆ తర్వాత జిమ్ చేయడంతో పాటు స్పోర్ట్స్ ఆడతానని తెలిపారు. పెళ్లి అనే ఆలోచన ఏ మాత్రం రాదని పేర్కొన్నారు.

సుమంత్ ఇచ్చిన క్లారిటీ చూస్తే.. ఇక లైఫ్‌లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నట్లుగా ఉంది. సుమంత్‌కు గతంలోనే వివాహం అయింది. తర్వాత విడాకులు కూడా అయ్యాయి. అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే ఉంటున్నాడు. 


More Telugu News