ఆర్మీకి విరాళం అందజేసిన అయ్యన్నపాత్రుడు
- జాతీయ రక్షణ నిధికి అయ్యన్నపాత్రుడు విరాళం
- ఒక నెల జీతం అందించిన ఏపీ స్పీకర్
- మన సాయుధ బలగాలు చూపిస్తున్న ధైర్యం అందరికీ గర్వకారణమని వ్యాఖ్య
ఏపీ అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన నెల జీతాన్ని (రూ. 2,17,000) జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉగ్రవాద నిర్మాలనలో మన సాయుధ బలగాలు చూపిస్తున్న ధైర్యం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. సాయుధ దళాల కృషి ప్రజలందరిలో జాతీయ భావనను పెంపొందించాలని ఆకాంక్షించారు.