హైదరాబాద్ లో బాణసంచా కాల్చడంపై నిషేధం
- భారత్-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం
- బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
- ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక
ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో బాణసంచా శబ్దాలు ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించవచ్చని, పేలుళ్ల శబ్దాలను తలపించి గందరగోళానికి దారితీయవచ్చని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. నగరంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటం, పౌరుల భద్రతకు భరోసా కల్పించడమే ఈ నిషేధం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, వీటిని ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. దేశ భద్రత దృష్ట్యా, ప్రజలు ఈ నిర్ణయానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడే వరకు ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉందని, నగర ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని పోలీస్ శాఖ కోరింది.